నంద్యాల పట్టణంలో ఏళ్ల తరబడి నివసిస్తున్న బొగ్గు లైన్, ఇస్లాంపేట పేదల గుడిసెలను పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దర్పంతో ఎంపీ, ఎమ్మెల్యేలు విర్రవీగితే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం పార్టీ పేద ప్రజలకు అండగా నిలుస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు తోట మధ్దులు, పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ, కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మణ్, వెంకట లింగం, పట్టణ కమిటీ సభ్యులు శివ, అవుకు. లక్ష్మణ్ లతోపాటు ప్రజాసంఘాల, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బొగ్గులైన్ , ఇస్లాంపేట ప్రాంత ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలందరినీ సమీకరణ చేసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి అనంతరం ధర్నా చేశారు. ధర్నా నుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ, కార్యదర్శివర్గ సభ్యులు లక్ష్మణ్, పి వెంకట లింగం లు మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా నివసిస్తున్న ఇస్లాంపేట ప్రజలను ఇప్పుడు జాతీయ రహదారి నిర్మాణం పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్ల స్థలాన్ని చూపించకుండా వేకువ జామున కరెంటు ఆఫీస్ ప్రోక్లైన్ బుల్డోజర్లతో పోలీసులు అడ్డం పెట్టుకొని గుడిసెలను కూల్చివేయడం అడిగిన వారందరినీ అరెస్ట్ చేయడం నియంతృత్వమని, ఇలా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదని ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యేలు స్వార్థం కోసం పనిచేస్తూ ప్రజలను ఇబ్బందుల గురిచేయడం సిగ్గుచేటని అన్నారు.
పేద ప్రజల పట్ల నిజంగా ఎంపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్కరికి ఇంధస్థలం ఇచ్చి అక్కడ కనీస మౌలిక వసతులు విద్యుత్ నీరు కాలువలు రోడ్లు ఏర్పాటు చేసి ప్రజలను ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని అట్లా కాకుండా బెదిరించి భయపెట్టి కాల్ చేయాలని చూస్తే ఊరుకోబోమని ఇప్పటికైనా స్థలాలు చూపించే చోట యుద్ధ ప్రాతిపదికదన మొలిక వసతులు కల్పించి ఖాళీ చేయాలని అలా కాకుండా అధికారం ఉందని పోలీసులు అడ్డం పెట్టుకొని పేద ప్రజలను ఇబ్బందులను గురి చేస్తే సహించబోమని సిపిఎం పార్టీ ప్రోక్లైన్లకు బుల్డోజర్లకు అడ్డంగా నిలిచి పేద ప్రజలను కాపాడుకుంటుందని హెచ్చరించారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులు ధర్నా దగ్గరకు వచ్చేసి ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లస్థలం చూపించేంతవరకు కాళీ చేయించా బోమనీ అని ఆమెతో ధర్నా విరమించారు.