ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల-5 గంటల వరకు సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని సాధిక్ నగర్ 29వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ వార్డు సచివాలయాన్ని సందర్శిస్తూ సిబ్బంది ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించి స్పందన ఫిర్యాదులను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. స్వీకరించిన స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యలను సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలకు సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, సరైన రీతిలో పరిష్కారం చూపకపోతే మళ్లీ మళ్లీ రీఓపెన్ అవుతాయన్నారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రా రెడ్డి, అడిషనల్ డిఎంహెచ్ఓ అంకిరెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Nandyala: ప్రతిరోజూ సచివాలయంలో స్పందన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES