వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్లో ఆమోదం కోసం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా చేయాలని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తిరస్కరించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ కేంద్ర మంత్రిని కోరారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలకు విచ్చేసిన కమ్యూనికేషన్ కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహన్ కు రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ తో పాటు జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, బిజెపి ఎస్టీ సెల్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రామచంద్రనాయక్, జిపిఎస్ రాష్ట్ర కన్వీనర్ నగేష్ నాయక్, మరియు ఇతర నాయకులు కలిసి బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై కేంద్రం మాత్రికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో రాజు నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల విషయంపై తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం వల్ల గిరిజనులు చాలా నష్టపోతారని భవిష్యత్తు భావితరాలకు తీరని అన్యాయం జరుగుతుందని మంత్రికి వివరించారు.
ఇది గిరిజనుల గొంతు కోసే తీర్మానమని, రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన జాతిని అంతం చేసేందుకు కుట్ర పన్నూతున్నారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి తీర్మానాన్ని తీసుకొచ్చారని అన్నారు ఈ విషయాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు జరగబోయే అన్యాయం గురించి స్పష్టంగా వివరించాలని ప్రాదేయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించకుండా గట్టిగా కృషి చేయాలని కోరారు.
Nandyala: గిరిజన జాతిని అంతం చేసే కుట్ర
గిరిజనులకు ప్రభుత్వం అన్యాయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES