Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: జగనన్న లేఔట్లలో మౌలిక వసతులు కల్పించండి

Nandyala: జగనన్న లేఔట్లలో మౌలిక వసతులు కల్పించండి

నిరుపేదలందరికీ ఇళ్ల పథకం కింద జగనన్న లేఔట్లలో పూర్తయిన గృహాలకు విద్యుత్ కనెక్షన్లు, త్రాగునీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో గృహ నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ పిడి రామశేషు, ఈఈ మాధవరావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ మనోహర్, నియోజకవర్గ స్పెషల్ అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో పూర్తయిన గృహాలకు నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్.సి స్థాయిలో వున్న గృహాలన్నీ ఈ నెల 15 లోపు పూర్తిస్థాయిలో పూర్తి చేయించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించి స్టేజ్ కన్వర్షన్ కు తీసుకురావాలన్నారు. నిర్మాణాలకు మెటీరియల్ కొరతలేదని అవసరమైన మెటీరియల్ ను బుక్ చేసుకుని గృహ నిర్మాణాలను ముమ్మరం చేయాలన్నారు. పూర్తయిన పనులకు బిల్లులు అప్ లోడ్ చేయడంతో పాటు కలర్ కోడింగ్, ఆర్చీల నిర్మాణాలపై ఫోకస్ పెట్టాలన్నారు. 13 లేఔట్లలో పెండింగులో వున్న 1300 ఎలక్ట్రికల్ పోల్స్, విద్యుత్ వైరింగ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అలాగే 18 లేఔట్లలో అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, కల్వర్ట్ ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సంబంధిత ఇంజనీర్లను కలెక్టర్ ఆశించారు. 66 లేఔట్లకు ట్యాబ్ కనెక్షన్లు ఇవ్వాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. లేఔట్ల వారీగా తాసిల్దార్లకు, ఎంపీడివోలకు గృహ నిర్మాణాల లక్ష్యాలు కేటాయించి ప్రతిరోజు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలన్నారు. ఫీజుబిలిటి వుండి ఇంకా ఇళ్ల ప్రారంభానికి నోచుకోని లేఔట్ల తాసిల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.మిడుతూరు,గోస్పాడు ఇతర మండలాల్లో జగనన్న కాలనీలకు భూసేకరణ చేసి గృహ నిర్మాణాలు చేపట్టక పోవడానికి గల కారణాలు విశ్లేషిస్తూ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాయానికి బాధ్యులెవరని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత తాసిల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 30 శాతం కన్నా తక్కువగా ప్రగతి ఉన్న లేఔట్లలో తాసిల్దార్లు, హౌసింగ్ ఇంజనీర్లు సందర్శించి పురోగతి తీసుకురావాలన్నారు. సచివాలయ సిబ్బందికి కూడా ప్రత్యేకించి గృహ నిర్మాణాల లక్ష్యాలను కేటాయించి ప్రగతి సాధించేందుకు తాసిల్దార్లు, ఎంపీడీవో లు కృషి చేయాలన్నారు. హౌసింగ్ ఈ కేవైసీ లో దిగువ నుంచి రెండో స్థానంలో ఉన్నామని లక్ష్య ప్రగతిపై పూర్తిస్థాయి దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. డిఆర్డిఏ ద్వారా గృహ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంతో పాటు అర్హులైన వారికి ముద్రా రుణాలు కూడా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News