నంద్యాల జిల్లాలో నెలరోజుల పాటు జరిగిన జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు అవసరమైన 2,88,565 ఉచిత సర్వీసులు అందించి విజయవంతం చేశామని డిఆర్ఓ పుల్లయ్య పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్ లో జగన సురక్ష కార్యక్రమంపై మీడియా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ జూన్ 24వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమైన 2,88,565 ఉచిత సర్వీసులు అందించామన్నారు. ప్రజల నుండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ తీసుకోకుండా ఉచితంగా అవసరమైన ధృవపత్రాలు అందించామన్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 409 సచివాలయాలు, 6 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 107 వార్డు సచివాలయాలు వెరసి మొత్తం 516 సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు నియోజకవర్గ స్పెషల్ అధికారులుగా, ఎంపీడీవోలు తాసిల్దార్లు రెండు బృందాలుగా ఏర్పాటై జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేశారన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చామన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి ముందుగానే వెళ్లి వారికి కావాల్సిన సర్వీసులు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకుని, సుమోటోగా వాలంటీర్ ద్వారా అప్లికేషన్ పెట్టించామన్నారు. వారం రోజుల తర్వాత ఆ సచివాలయంలోనే క్యాంపు ఏర్పాటు చేసి ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్ ఒక టీంగా, తహశీల్దార్, ఈఓఆర్డి మరొక టీంగా ఏర్పడి సచివాలయ పరిధికి వెళ్లి ఏ సర్వీసెస్ అయితే రిజిస్టర్ చేశారో ఆ సర్వీసెస్ కి సంబంధించిన సర్టిఫికెట్లు ప్రజలకు నేరుగా అందించామని తెలిపారు. 516 సచివాలయాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి 2,88,565 సర్వీసులు అందించామన్నారు. స్వీకరించిన సర్వీస్ రిక్వెస్ట్ లలో 99.21 శాతం సర్వీసులను ప్రజలకు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందించామన్నారు.2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను అతి తక్కువ సమయంలో అందించడం జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు 1,35,536, ఇన్కమ్ సర్టిఫికెట్లు 1,29,412 పంపిణీ చేసామన్నారు. ఆర్ఓఆర్ 1(బి) సర్టిఫికెట్ లు 5,517, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ సర్వీస్ 5,366, కంప్యూటరైజేషన్ ఆఫ్ అడంగల్ సర్టిఫికెట్ 2,578 మందికి, పెళ్ళైన కారణం చేత గాని లేదంటే వివిధ కారణాల చేత గాని ఇంటి సభ్యుల స్ప్లిట్టింగ్ జరిగిన వారికి 2,196 రేషన్ కార్డులు, కొత్త రైస్ కార్డులు 306 తో పాటు ఇతర సర్వీసులు మొత్తము 2,88,565 అందించామని డిఆర్ఓ వివరించారు.*ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ లాంటివి, మ్యుటేషన్ లాంటి సేవలను నిర్దిష్ట గడువు లోపు అర్జీదారులకు అందజేయడం జరుగుతుందని డిఆర్ఓ తెలిపారు. జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమాలలో స్వీకరించిన ఫిర్యాదులను ప్రజలు సంతృప్తి చెందిస్తాయిలో పరిష్కరించడంతోపాటు…. పరిష్కారం కాని వాటిని ఏ కారణం చేత పరిష్కారం కాలేదని వారికి తెలియజేయడానికి సురక్ష క్యాంపులు, ఇంటింటి సర్వే చాలా ఉపయోగపడ్డాయన్నారు. అదేవిధంగా ప్రజలకు ఏవైతే హక్కుగా అందాలో వాటిని లబ్ధిదారులకు అందజేయడానికి ఈ క్యాంపులు సద్వినియోగమయ్యాయని అన్నారు.
Nandyala: జగనన్న సురక్ష ద్వారా 2,88,565 ఉచిత సర్వీసులు
ప్రజల ముంగిట ప్రభుత్వ పాలన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES