‘స్పందన’ వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆ దిశలో అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తో పాటు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, ఐడిసి చైర్మన్ కర్రా గిరిజ, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి, అడిషనల్ ఎస్పి రమణ, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రజా విజ్ఞప్తులు సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ ప్రధాన లక్ష్యమని సమస్యలను పరిష్కరించేందుకు అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు సచివాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే స్పందనలో సచివాలయ సిబ్బంది హాజరై వినతులు స్వీకరించి మండల స్థాయిలోనే అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ జరిపి పరిష్కరిస్తే 90 శాతం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియ చేయవచ్చన్నారు. సంక్షేమ పథకాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే ఫిర్యాదు చేయవచ్చన్నారు. రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంటుందన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ‘జగనన్నకు చెబుదాం’ 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
Nandyala: ‘స్పందన’ సమస్యలను పరిష్కరించడమే ‘జగనన్నకు చెబుదాం’
సంబంధిత వార్తలు | RELATED ARTICLES