ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం (26-06-23) నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో వినూత్న తరహాలో “జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి జూన్ 26వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా “జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Nandyala: “జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమం
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే 'స్పందన '
సంబంధిత వార్తలు | RELATED ARTICLES