Wednesday, July 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: కర్బూజ విత్తనాలపై అమ్మవారి సూక్ష్మచిత్రాలు

Nandyala: కర్బూజ విత్తనాలపై అమ్మవారి సూక్ష్మచిత్రాలు

చాలా స్పష్టంగా ఉన్న అమ్మవారి ముఖ కవళికలు

నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ దసరా పర్వదినం పురస్కరించుకొని కర్బూజ, విత్తనాలపై వివిధ రూపాలతో అమ్మవారి చిత్రాలను మైక్రో ఆర్ట్ కళను ప్రదర్శించారు. మైక్రోబ్రష్ తో మూడు విత్తనాలపై వేసారు. భద్రకాళి, మహిశాసుర మర్ధిని, దుర్గామాతల సూక్ష్మ చిత్రాలను వేసారు. ఈ చిత్రాలలో అమ్మవారి హావాభావాలను స్పష్టంగా వేసారు. ప్రతి దసరా పండుగకు వినూత్నంగా అమ్మవారి చిత్రాలను వేస్తారు. హిందువులు జరుపుణమే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దిన్ని విజయదశమి అని పిలుస్తారు. మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు అమ్మవారు యుద్ధం చేసి వీన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండగ జరుపుకుంటారని చింతల పల్లి కోటేష్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News