నంద్యాలలో స్థానిక టిడిపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను సర్వం నాశనం చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగనే అని, ఈ రాక్షస పాలనలో ప్రజలంతా విసుగు చెందారని, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఎన్నో మాఫియాలు, ఎన్నో దందాలు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్నారని, త్వరలోనే వీళ్లకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయన్నారు. 45 రోజుల్లో వీళ్ళని ఇంటికి సాగనంపాలని ఫరూక్ నేతృత్వంలో పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడుని, నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ ని, నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరిని గెలిపించాలని కోరారు.
Nandyala: రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం
అన్నీ మాఫియాలే..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES