Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ప్రధాని గ్రామ సడక్ యోజన నిధులు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వాడండి

Nandyala: ప్రధాని గ్రామ సడక్ యోజన నిధులు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వాడండి

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనలు, RoFR చట్టం ప్రకారం గిరిజనులకు పట్టాల పంపిణీతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను సూచించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద అందించిన నిధులను గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ఉపయోగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతాల్లో ఇది తన మూడవ పర్యటన అన్న గవర్నర్, ఇలా గిరిజనులను కలవటం సంతోషంగా ఉందన్నారు. గిరిజన జనాభాను ఆధునిక సమాజంలోకి తీసుకురావడం, అదే సమయంలో వారి సాంప్రదాయ సంస్కృతి మరియు ప్రత్యేక పద్ధతులను కాపాడుకోవడం మధ్య సమతుల్యతను సృష్టించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలన్నారు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News