Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన రజిని

Nandyala: వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన రజిని

నంద్యాల ప్రజల చిరకాల వాంఛ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని… ఈ విద్యా సంవత్సరం 150 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు విద్యనభ్యసించేలా జాతీయ వైద్య విద్యా మండలి అనుమతులు మంజూరు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శరవేగంగా జరుగుతున్న నూతన మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎపీఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర హస్త కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేధించి నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 17 మెడికల్ కళాశాలల నిర్మాణ పనుల్లో ఐదు మెడికల్ కళాశాలలను ప్రాధాన్యతగా తీసుకొని పనులు ప్రారంభించామన్నారు. ఇందులో విజయనగరం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం కాలేజీలలో ఈ ఏడాది ఆగస్టు నుండి మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థులు విద్యను అభ్యసించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే మూడు కాలేజీలకు జాతీయ వైద్య విధాన మండలి అనుమతులు వచ్చాయన్నారు. ఈ ఏడాది 750 ఎంబిబిఎస్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని మంత్రి వివరించారు.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లాకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన మెడికల్ కళాశాల నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు అడ్డం వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని కళాశాల నిర్మాణానికి విశేష కృషి చేశారని మంత్రి తెలిపారు. నూతన ఒరవడలతో ప్రజలకు అనన్య రీతిలో అనుకూలమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని గమనించాలని మంత్రి సూచించారు.*

- Advertisement -

స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ శిక్షణ కేంద్ర పరిధిలోని 50 ఎకరాల్లో 475 కోట్ల కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయన్నారు. ప్రజల అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన పనులకు కోర్టు కూడా అనుకూలమైన తీర్పునిచ్చిందన్నారు.అంతకుముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్ కళాశాల నిర్మాణ స్ట్రక్చర్ల చాయ చిత్ర ప్రదర్శనను తిలకించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ స్వర్ణలత, ఆస్పత్రి పర్యవేక్షకులు వరప్రసాద్, డిసిహెచ్ఎస్ జఫ్ఫురుల్లా, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News