Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ్ షహర్

Nandyala: మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ్ షహర్

స్వచ్ఛభారత్ 2.0 లో భాగంగా మేరీ లైఫ్ మేరీ స్వఛ్చ్ షహర్ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంతో స్వఛ్చ నంద్యాలలో ప్రజలను భాగస్వాములను చేస్తూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఆర్ఆర్ఆర్ సెంటర్ అనగా ” R- రెడ్యూస్, R- రియూస్, R-రీసైకిల్ “సెంటర్ ని ప్రారంభించారు. మీరు వీటితో ఉపయోగం లేదు అనుకునే రీసైకిల్ ప్రక్రియకు పనికివచ్చే వస్తువులు అనగా పాత పుస్తకాలు, పాత దుస్తులు, పాత ప్లాస్టిక్ సామాన్లు, పాత ఇనుప వస్తవులు, మరియు పాత వంట సామగ్రి ఆర్ఆర్ఆర్ సెంటర్ నందు జమ చేసి మేరా లైఫ్ మేర షహెర్ లో బాధ్యతాయుత భాగస్వాములు కాగలరు, కావున నంద్యాల ప్రజలందరూ రీసైకిల్ ప్రక్రియకు పనికివచ్చే వస్తువులను వీధుల చివర, కాలవలయందు చేరనికుండా ఆర్ఆర్ఆర్ సెంటర్ కు జమ చేసి పరిశుభ్ర నంద్యాల సాధించటంలో పాలుపంచుకోవాలని కోరారు. ఆర్ఆర్ఆర్ (RRR) సెంటర్ ” R- రెడ్యూస్, R- రియూస్, R-రీసైకిల్ “సెంటర్ ప్రారంభోత్సవం మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి , శానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద రెడ్డి ,పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News