Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: నామినేషన్ వేసిన శిల్పా కిషోర్ రెడ్డి

Nandyala: నామినేషన్ వేసిన శిల్పా కిషోర్ రెడ్డి

జిల్లా క్లీన్ స్వీప్ చేస్తాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ డాక్టర్ నవంబర్ , మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మిద్దె శివరాం, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ శేఖర్ రెడ్డి, అడ్వకేట్ రామచంద్రారెడ్డి, నెరవాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
రాబోయేది జగనన్న రాజ్యం రాబోయేది రాజన్న రాజ్యం అని రెండవసారి ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవిని అధిష్టించబోతున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో , పూర్తి విశ్వాసంతో నంద్యాలలో మరోసారి వైఎస్ఆర్ పార్టీ ఎగరవేస్తానని అందులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదంతో నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

నంద్యాల ప్రజలందరూ తనను సొంత బిడ్డల ఆశీర్వదించి 2019లో ఎమ్మెల్యేగా గెలిపించారని, రెండవసారి తనను ఆశీర్వదించేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా నంద్యాల నియోజకవర్గ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఒక కుటుంబంలో కలసి వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించడానికి తరలి వచ్చారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు తనపై, అలాగే జగనన్నపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకం, నూటికి నూరు శాతం సాధించేందుకు కష్టపడి పని చేస్తానని మాటిస్తున్నామన్నారు. ఎన్నికల సంగ్రామానికి కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉన్నదని, ఉన్న ఈ కొద్ది సమయంలో అందరం కష్టపడదామని కోరారు. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని కచ్చితంగా చూడబోతున్నామన్నారు. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు.

ప్రజలు ఏదైతే కచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మీద పెట్టుకున్న అంచనాలు వమ్ము చేయక అంతకుమించిన సీట్లను రాష్ట్రంలో గెలవబోతున్నామన్నారు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం, దూరదృష్టి అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు మార్పులు చేశారని తెలిపారు. గతంలో ఏ నాయకుడు చేయనట్లుగా ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారని చెప్పారు. జగనన్న లాంటి గొప్ప నాయకుడు ఎవరు లేరన్నారు. జగనన్న దిశా నిర్దేశంతో రాష్ట్రంలోని వైయస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి గడపకు తిరిగి స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం జరిగిందన్నారు. నంద్యాల నియోజకవర్గంలో 92 వేలకు పైగా గృహాలను సందర్శించి వారితో కలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. వైయస్సార్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో పోగా, మిగతా మూడు సంవత్సరాలు ఆనేక అభివృద్ధి చేశామని చెప్పారు. అందుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామన్నారు. 21 సంవత్సరాల పాటు అధికారం చేపట్టిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు, నంద్యాలలో మా ప్రత్యర్థి నాయకుడు ప్రజలకు ఏమి చేశామో… ఏమి చేస్తామో… చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. కేవలం ప్రతిపక్షాలకు ఉన్న లక్ష్యం… జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాలని, గద్దె ఎక్కనియ్యకుండా చేయాలన్న దురాలోచన తప్పితే ప్రజలకు రాష్ట్రానికి ఏమి చేయబోతున్నామో చెప్పే పరిస్థితులలో వారు లేరన్నారు. ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన ధోరణి వారిలో కొంతైనా లేకపోవడం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసిన మేలుల గురించి ధైర్యంగా ప్రజల మధ్య ఉంటూ మాట్లాడుతున్నామని, ప్రజలకు అందించిన సంక్షేమం గురించి తెలియజేస్తున్నామని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, నంద్యాలలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో నంద్యాలకు ఏమి చేయబోతున్నాం… రాష్ట్రానికి ఏమి చేయబోతున్నాము తెలియ చెబుతున్న పరిస్థితి తమకు ఉందన్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. పోయినంత కాలం వ్యక్తిగత అజెండాలకు తావు లేకుండా తాము రాష్ట్రాన్ని , నంద్యాలను అభివృద్ధిలోకి ఎలా తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు . ప్రజలందరూ మరోసారి తనకు అవకాశం కల్పిస్తారన్న పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో నూటికి నూరు శాతం నంద్యాల నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు తన శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తానని భరోసానిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News