Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడండి

Nandyala: త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడండి

నంద్యాల జిల్లాలో మరమ్మతులకు గురైన 49 బోర్లకు వారం రోజుల్లో రిపేర్లు చేయించి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతి రాజ్, ఉపాధి హామీ తదితర పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డ్వామా పిడి రామచంద్రారెడ్డి, డిపిఓ శ్రీనివాసులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా మరమ్మతులకు గురైన త్రాగునీటి పథకాలు, బోర్లకు మరమ్మతులు చేయించాలన్నారు. జల జీవన్ మిషన్ కింద ఇంకా ప్రారంభించని 51 పనులను వెంటనే ప్రారంభించేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇంటింటికి కొళాయి కనెక్షన్ నిమిత్తం టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న 116 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణాలకు సంబంధించి మండల, సబ్ డివిజన్ల వారీగా లక్ష్యాలు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మరమ్మతులకు గురైన 1766 సోక్ పిట్లను మూడు రోజుల్లో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఉపాధి హామీ పథకం కింద రోజువారి లేబర్ రిపోర్టింగ్ శాతాన్ని పెంచాలన్నారు. మే మాసానికి సంబంధించి 32 లక్షల గాను 19 లక్షల పని దినాలు మాత్రమే కల్పించారని ఈ నెలాఖరులోగా మిగిలిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మస్టర్ ప్రకారం ఉపాధి కూలీలకు మూడు రోజుల్లో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్న, చిన్నకారు రైతులకు 5 వేల హెక్టార్లలో వివిధ రకాల పండ్ల ఉత్పత్తులకు ఉపాధి హామీ కింద చేపట్టాలన్నారు. అమృత సరోవర్ కింద చెరువుల పునరుద్ధరణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎంపీడీవో, ఎపీడీలను కలెక్టర్ ఆదేశించారు.జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పెండింగ్ లో ఉన్న 152 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల యూనిట్ల పనులు వేగవంతం చేసి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయడంతో పాటు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ జీవో నెంబర్ 693 లోని మార్గదర్శకాల ప్రకారం కుక్కలు కోతులు, పందులు తదితర మూగజీవాలను సరిహద్దు ప్రాంతాల్లోని సురక్షిత ప్రదేశాలలో వదిలేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News