ఢిల్లీలో 40 రోజులుగా పోరాడుతున్న రేజ్లర్లు సమస్యను పట్టించుకోకపోవడం నరేంద్ర మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు జయలక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. రాజీవ్ గాంధీ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున ఈ దారుణం జరగడం న్యాయమేనా అని ఆయన ప్రశ్నించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దేశ రాజధాని ఢిల్లీలో మహిళకు భద్రత కల్పించకపోగా భారత మహిళా రెజ్లర్లపై పోలీసుల దాడులు అనంతరం వారిపై నమోదు చేసిన కేసులను ఉద్దేశించి పత్రికా ప్రకటన వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిష్ఠించిన చారిత్రాత్మక ‘సెంగోల్ (రాజదండం)’ తొలిరోజే వంగిపోయిందని ఎద్దేవా చేశారు..తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ భారతదేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
Nandyala: నరేంద్ర మోడీ నియంతృత్వానికి పరాకాష్ట
సంబంధిత వార్తలు | RELATED ARTICLES