నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సిఐటియు, ఐద్వా, యుటిఎఫ్ కమిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలలో భాగంగా దేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడిన వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయని .. మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, ఐఎంఏ అధ్యక్షురాలు వసుధర రాణి, కంటి స్పెషలిస్ట్ డాక్టర్ క్రాంతి , ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి నిర్మల అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వి ఏసురత్నం ,యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి వి ప్రసాద్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి సునీత, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమణకుమారి, పట్టణ కార్యదర్శి షమీమ్, యూనియన్ జిల్లా కార్యదర్శి తిరుపతయ్య, యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు శాంతి ప్రియ, నాయకురాలు షమీంబాను, లతోపాటు సిఐటియు జిల్లా కార్యదర్శి పి వెంకట లింగం, మధ్యాహ్నం భోజనం యూనియన్ జిల్లా నాయకురాలు ఈశ్వరమ్మ లతోపాటు మహిళలు పాల్గొనడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళల పైన ప్రతి గంటకోసారి ఎక్కడో ఒకచోట దాడులు అత్యాచారం జరుగుతుందని, ప్రభుత్వాలు ఈ దాడులు చేసిన వారి పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఉందని ,ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుపోవడం వల్లే అనేకమంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత నివ్వాలని సమాన హక్కులు కల్పించాలని, మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని పురుషులు కూడా మహిళలకు సహకారం అందించాలని, అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని, మహిళలను చులకనగా చూడకూడదని, మహిళలకు ఉండే ప్రతి బాధలోనూ పురుషులు పాలుపంచుకొని సహకరించాలని ఉన్నారు.