Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ఘనంగా 'వరల్డ్ రెడ్ క్రాస్ డే'

Nandyala: ఘనంగా ‘వరల్డ్ రెడ్ క్రాస్ డే’

నంద్యాల కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో వరల్డ్ రెడ్ క్రాస్ డే ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాట్ చిత్రపటానికి నివాళి అర్పించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ముద్రించిన వడదెబ్బ, వడగాలులపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య , జెడ్పి సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా వైద్యాధికారి డా. వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డా.జఫరుల్లా, మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యుడు మద్దిలేటి తదితరులు హాజరై స్పందనలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు అందజేయడానికి విచ్చేసిన అర్జీ దారులు దాదాపు 250 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. స్పందన అర్జీదారులకు డాక్టర్ వసిం హాసన్ రాజా సర్జన్, సంజామల మండల మానవతా కన్వీనర్ నరసింహమూర్తి సహకారంతో అర్జిదారులకు భోజనాలు ఏర్పాటు చేయటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News