ఉమ్మడి కర్నూలు జిల్లాలో పులి పిల్లలు దొరికాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు కలకలం సృష్టించాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్థులు, వాటిపై కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా గదిలో భద్రపరచారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం సమీపంలో ఈ పులి పిల్లల విషయం సంచలనం సృష్టిస్తోంది.
