భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) మనవడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో ఏర్పాటు చేసిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకయ్యనాయుడు కాళ్లకు లోకేష్ నమస్కారం పెట్టారు.
- Advertisement -

ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్‌కు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.



