Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

Nara Lokesh: ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

ఏపీలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వెలుగులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(CBG) ప్లాంట్‌కు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, సీఎస్ కె.విజయానంద్, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ఎమ్. అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

కాగా దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో రూ.139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా రూ.65వేల కోట్లతో నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంటు ఇదే. వీటి ద్వారా వచ్చే ఐదేళ్లలో 2.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News