Nara Lokesh Meets Nitin Gadkari: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అసోం పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం.. గౌహతి విమానాశ్రయంలో నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తన ఆయనతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటూ అభివర్ణించిన లోకేష్, ఆయన్ను కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జాతి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో గడ్కరీ చూపిస్తున్న ఉత్సాహం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశాన్ని వేగంగా, బలంగా నిర్మించాలన్న గడ్కరీ తపన అమోఘమని కొనియాడారు.
Also Read: https://teluguprabha.net/top-stories/cm-vijay-sensational-decision/
Delighted to meet Union Minister Shri Nitin Gadkari ji at Guwahati airport today.
The “Highway Man of India” continues to inspire all of us with his infectious enthusiasm for nation-building, transformative infrastructure and his relentless drive to build a faster, stronger… pic.twitter.com/L5g6uoICrR
— Lokesh Nara (@naralokesh) May 12, 2026
ఏపీలో జరుతున్న అభివృద్ధి పనులపై గడ్కరీ ప్రశంసలు..
ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను గడ్కరీ ప్రశంసించినట్లు లోకేష్ వివరించారు. ఏపీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు నిర్మించేందుకు గానూ ఆయన ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, గడ్కరీ తాజా రాజకీయ పరిస్థితులపై, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

