నారా లోకేష్ రాష్ట్రంలో చేపడుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ఆర్సిపి నాయకులపై స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ పై అసత్యపు ఆరోపణలు, దిగజారుడు రాజకీయాలు చేస్తూ లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. లోకేష్ సభలో మాట్లాడిన తీరును ఎమ్మెల్యే శిల్పారావ్ చంద్ర కిషోర్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను లోకేష్ నంద్యాల నుండి వెళ్లే లోపు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. సంస్కారం, సభ్యత మరిచి మాట్లాడడం లోకేష్ కు, టిడిపి నాయకులకు తగదని వ్యవహార శైలిని మార్చుకోవాలని, దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని ఎమ్మెల్యే హితవు పలికారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాలలో నిర్వహించిన సభలో లోకేష్ ప్రజల సమస్యల గురించి, రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి, భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి గురించి ప్రస్తావిస్తాడని ప్రజలు ఆశించారని, అయితే అతను కేవలం అధికార పార్టీ పైన వైఎస్ఆర్సిపి నాయకుల పైన దృష్టి కేంద్రీకరించి అసత్య ఆరోపణలు చేస్తూ బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారన్నారు. లోకేష్ ఎదుటివారిని తిడుతూ తాను తిట్టిచ్చుకుంటూ పక్క పేర్లు పెడుతూ మ్యాసోకిజం చేస్తూ ఒక శాడిస్టుల ప్రవర్తిస్తున్న తీరు హాస్యస్పదంగా ఉందన్నారు. లోకేష్ తనపై చేసిన ఆరోపణలు నిజం లేదు కాబట్టి నేను నిర్భయంగా మాట్లాడుతున్నానని అన్నారు. రాయమాల్ పురం స్మశాన వాటిక తమ సర్పంచ్ కబ్జా చేసినట్లు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కుందూ నది మట్టిని అక్రమంగా తరలించామని ఆరోపించారని, కుందూ మట్టిని దేవాలయాలకు, మసీదులకు, ప్రజాప్రయోజనాలకి ఉపయోగించామని స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని చెబుతూ ముస్లిం మైనార్టీల జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అబ్దుల్ సలాం కుటుంబానికి అండగా ఉన్నది వైయస్సార్ పార్టీ మాత్రమే అన్నది నిజమన్నారు. ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడం టిడిపి వారికి తగునన్నారు. ఆర్టీవో ఏజెంట్ కరీం కుటుంబానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా నిలిచి, ఆర్థిక సాయంగా తొమ్మిది లక్షలు అందించామన్నారు. అలాగే కరీముల్లా పిల్లలకు ఉచిత విద్య అందిస్తూ, వారి పేరున ఫిక్స్ డిపాజిట్లు చేశామని తెలిపారు. లోకేష్ ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదవడం అలవాటైందని అందులో నిజాలు తెలుసుకోవాలన్నారు. లోకేష్ జ్యోతిష్యం చెప్పడానికి పనికి వస్తాడే తప్ప రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. టిడిపి నాయకులు నంద్యాలలో కబ్జాలు చేస్తే ఆ పాపం వైసిపి నాయకులపై ఆపాదించడం సమంజసం కాదన్నారు. బోగ్గులైన్ రహదారి వెడల్పులో తమ స్వలాభం ఎక్కడుందో లోకేష్ చూపాలన్నారు. నష్టాల్లో ఉన్న విజయ డైరీ ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే 33 కోట్ల రూపాయల ఆదాయం చేకూర్చిందన్నారు. హెరిటేజ్ డైరీ కోసం ప్రభుత్వ రంగ డైరీలను నష్టాలు ఊబిలోకి నెడుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 15 మందిని వైసిపి వారు నడి రోడ్డు పై నరికారని లోకేష్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అబద్దం పది సార్లు చెబితే అది నిజం కాదని, లోకేష్ తెలుసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు పక్క పేర్లు పెట్టడం లోకేష్ కు తగదన్నారు. మమ్మల్ని తిడితే మేము తిడతామని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి హితవు పలికారు. నంద్యాలలో మూడు రోజులు లోకేష్ ఎంటర్ టైన్మెంట్ జబర్దస్త్ కామెడీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ముందు మీ టిడిపిలో జరుగుతున్న పరిస్థితులను చక్కబెట్టుకోవాలని, ఎదుటివారిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. నంద్యాల విడిచి వెళ్లే లోపు మీ టిడిపి నాయకులు విజయ డైరీ కి ఇవ్వాల్సిన ఒక కోటి 42 లక్షలు చెల్లించి వెళ్లాలని కోరారు. సినిమా పార్టీ , సినిమా డైలాగులు, డ్రామాలు కట్టి పెట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా, రాష్ట్ర మార్కె ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మా బు న్నిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పామ్ షా వలి, దృశ్యకలల డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డా. శశికళ రెడ్డి, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ సిద్ధం శివరాం, సర్పంచ్ పూల శ్రీను,టివి రమణ, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
Shilpa: దిగజారుడు రాజకీయాలు మానుకోండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES