Nara Lokesh on Mahanadu Success: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మహానాడు 2026’ ఘన విజయం సాధించగా, ఆ విజయాన్ని పార్టీ కార్యకర్తలకు, మిత్రపక్షాలకు అంకితం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కోట్లాది మంది టీడీపీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యానన్నారు. తాను ఈ పదవిని చేపట్టిన తర్వాత జరిగిన తొలి మహానాడు ఇదేనని, అందుకే ఈ మహానాడు ప్రత్యేకమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి వల్ల మహానాడు విజయవంతం అయిందని చెప్పారు.
Also read: Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. ఆ ఎమ్మెల్యేకు సిట్ నోటీసులు..!
ఈ విజయం పార్టీ నేతలు, కార్యకర్తకు అంకితం..
మహానాడు-2026 విజయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయ యంత్రాంగం, మహానాడు కమిటీలు, బ్యాక్ ఆఫీస్, టెక్నికల్ టీమ్, మై టీడీపీ, ఐ టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, అనుబంధ సంఘాలు, మీడియా మిత్రులు, ఎన్ఆర్ఐలు, మిత్రపక్షాలు, ప్రజలు, భద్రతా సిబ్బంది అందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు. మీ అందరి కృషికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు. నెల్లూరులో జరగాల్సిన మహానాడును ప్రధాని మోదీ పిలుపుతో, అందరి ఆమోదంతో ఈసారి హైబ్రిడ్ విధానంలోకి మార్చామని లోకేశ్ గుర్తు చేశారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడాన్ని మన నాయకుడు చంద్రబాబు మనకు నేర్పారని.. అదే స్పూర్తితో హైబ్రిడ్ మహానాడు నిర్వహించి విజయవంతం చేశామన్నారు. ఇప్పుడు తెలుగు వారి ప్రతి ఇల్లు, ప్రతి పల్లె మహానాడుకు వేదికైందని కొనియాడారు. టీడీపీ పార్టీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిందన్నారు. ఇది మహానాడు సాధించిన మరో ఘన విజయమని కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

