Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: మాది గూగుల్.. మీది గొడ్డలి.. మహానాడులో వైసీపీకి లోకేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Nara Lokesh: మాది గూగుల్.. మీది గొడ్డలి.. మహానాడులో వైసీపీకి లోకేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Nara Lokesh Speech in Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడు-2026 అట్టహాసంగా ప్రారంభమైంది. వర్చువల్‌గా జరుగుతున్న ఈ మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పలు కీలక తీర్మాణాలు ప్రవేశ పెట్టారు. టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా మహానాడు వేదికపై ప్రసంగించిన లోకేశ్‌.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తనపైనే 23 కేసులు పెట్టి వేధించారని, అయినా తాము వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. “మాట తప్పం.. మడమ తిప్పం” అన్న నినాదంతోనే ముందుకు సాగామని చెప్పారు. గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దాడులను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు తాను సిద్ధమని జగన్‌కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ పాలనతో ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పోల్చేందుకు ఓపెన్ డిబేట్‌కు రావాలని ఆహ్వానించారు. డేట్, టైమ్ మీరే నిర్ణయించండి అంటూ ఛాలెంజ్ చేశారు.

- Advertisement -

Also Read: Nara Lokesh: మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన.. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయింపు!

గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం..

అలాగే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని లోకేశ్ ప్రశంసించారు. చంద్రబాబులో ఇప్పటికీ యువతరానికి సరిపోయే ఉత్సాహం ఉందని, ఆయన జెట్‌ స్పీడ్‌తో పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుండటానికి చంద్రబాబు విజన్ కారణమన్నారు. “నేషన్ ఫస్ట్” అనేది టీడీపీ సిద్ధాంతమని చెప్పారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం సూసైడ్ చేసుకుంది. ఎంతో మంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారని గుర్తు చేశారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్‌ను ఏకంగా కిరోసిన్ పోసి చంపేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి.. డోర్ డెలివరీ చేసి చరిత్ర మీది అని, గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి కోపం వచ్చింది. మాది గూగుల్.. మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్.. మీది ఫ్యాక్షన్. మాది కియా అయితే.. మీది కిడ్నాప్” అంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలని లోకేశ్ స్పష్టం చేశారు. మహానాడు కేవలం రాజకీయ సమావేశం మాత్రమే కాదని, అది కార్యకర్తల పండుగ అని అభివర్ణించారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించడం ప్రధాని నరేంద్ర మోదీ సూచనలతోనే సాధ్యమైందన్నారు. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మహానాడు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News