Monday, January 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Mid Day Meals: ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

Mid Day Meals: ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

ఏపీలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శనివారం నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన(Mid Day Meals)సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) విజయవాడలోని పాయకాపురం కాలేజీలో ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 475 జూనియర్ కాలేజీల్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. దీని కోసం మార్చి 31, 2025 వరకు ప్రభుత్వం రూ.29.39 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం కోసం మరో రూ.85.84కోట్లు కేటాయించింది.

- Advertisement -

ఈ ఉచిత మధ్యాహ్న భోజనం కేవలం పేద విద్యార్థులకు మాత్రమే. దారిద్ర్యరేఖ(BPL)కు దిగువన ఉన్న విద్యార్థులు చదువుకి దూరం అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కాగా 2014-19 మధ్యలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉచిత భోజన పథకం ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మళ్లీ దాన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెనూ ఇలా..

సోమవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ.

మంగళవారం: అన్నం, గుడ్డుకూర, పప్పు, రసం, రాగిజావ.

బుధవారం: వెజ్‌ పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ.

గురువారం: అన్నం, సాంబారు, గుడ్డుకూర, రాగిజావ.

శుక్రవారం: పులిహోర, చట్నీ(గోంగూర, కూరగాయలు), ఉడికించిన గుడ్డు, చిక్కీ.

శనివారం: అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్‌ పొంగల్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News