Sunday, November 24, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: జగన్ విమర్శలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: జగన్ విమర్శలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh| చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన జగన్(Jagan) ఇప్పుడు సుద్దపూసని అంటూ కబుర్లు చెప్పడం విచిత్రంగా ఉందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

“గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన మీది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్ బాల్ ఆడుకుంది మీరు.

నాడు – నేడు అంటూ పబ్లిసిటీ పీక్‌కు తీసుకెళ్లారు కానీ విషయం వీక్ అని తేలింది. నా క్షేత్రస్థాయి పర్యటనల్లో కనీసం పిల్లలు కూర్చోడానికి బల్లలు, తాగునీరు, టాయ్ లెట్లు లేని పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వలన జరుగుతున్న అనర్ధాలను మీరు నేరుగా తల్లితండ్రులను అడిగి తెలుకోవచ్చు. అందుకే మేము స్కూళ్లలోనే పిల్లల సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.

రాష్ట్రంలో గత ఐదేళ్లలో మీ వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డిఎస్సీతో భర్తీచేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం.

లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపజేసే కనికట్టు విద్యలో మాస్టర్స్ చేసిన మీకు విద్యారంగంలో మేం చేస్తున్న మంచిపనులు కన్పించకపోవచ్చు. ఎవరేమనుకున్నా రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబుగారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా విద్యారంగ సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే!” అని లోకేష్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News