Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Rammurthy Naidu: ముగిసిన నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు

Nara Rammurthy Naidu: ముగిసిన నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి(Nara Rammurthy Naidu) అంత్యక్రియలు ముగిశాయి. వారి స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారి పల్లెలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, రామ్మూర్తి కుమారుడు నారా రోహిత్‌, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు నేతలు అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమనమ్మ అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

కాగా అంతకుముందు పలువురు ప్రముఖులు, స్థానికులు రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు.. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News