Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Rohit: పెద్దనాన్న చంద్రబాబుకు కృతజ్ఞతలు: నారా రోహిత్

Nara Rohit: పెద్దనాన్న చంద్రబాబుకు కృతజ్ఞతలు: నారా రోహిత్

Nara Rohit| తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో విషాదంలో మునిగిపోయిన తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన తనయుడు, హీరో నారా రోహిత్ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

‘‘తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న చంద్రబాబు(Chandrababu), పెద్దమ్మ భువనేశ్వరి, లోకేశ్‌ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

కాగా ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడైన రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు స్వగ్రామం నారావారి పల్లెలో ముగిశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad