Thursday, January 9, 2025
Homeఆంధ్రప్రదేశ్Lokesh: పేదల ఆశాదీపం నరేంద్ర మోదీ- విశాఖ సభలో నారా లోకేశ్

Lokesh: పేదల ఆశాదీపం నరేంద్ర మోదీ- విశాఖ సభలో నారా లోకేశ్

ప్రధాని నరేంద్ర మోదీ పేదలు, మహిళల ఆశాదీపం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో ప్రధాని రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ వేదికగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆసక్తికర ప్రసంగం చేశారు. సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన నరేంద్ర మోదీకి హృదయపూర్వకం స్వాగతం పలుకుతున్నాం అంటూ లోకేశ్ అన్నారు. ప్రతి భారతీయుడి హృదయంలో నమో ఉన్నారని లోకేశ్ అన్నారు. ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం ప్రధని అని పేర్కొన్నారు. అంతేకాదు ప్రధాని అనే పదానికి మోదీ అర్థం మార్చారని.. గతంలో కేవలం ప్రధానులు దేశానికి ఉంటే.. నేడు నమో ప్రజలమనిషిని తెలిపారు.

- Advertisement -

మోదీ విజన్ ను ఇప్పుడు ప్రపంచం చూస్తోందని లోకేశ్ అన్నారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందని దేశంగా మార్చేందుకు మోదీ కృషి చేస్తోందని వరించారు. విజన్ ఉన్నవారు దునియా అంతా చూస్తుందని తెలిపారు. చంద్రబాబు విజన్ 2020 అంటే కొందరు ఎగతాళి చేసి వెటకారంగా మాట్లాడారని.. నేడు హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ లో చెప్పిన ప్రతి మాట నిజమైందని లోకేశ్ తెలిపారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు. ఇక గత ప్రభుత్వ నిర్వాకంతో వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారని పేర్కొన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు మన సీబీఎన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. రూ.1000 పెన్షన్ పెంచేందుకు గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది… కానీ మన సీబీఎన్ ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ రూ.1000 పెంచారని తెలిపారు. అన్న క్యాంటీన్లు తెరిపించారని, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. అంతేకాదు త్వరలోనే మెగా DSC రానుందని అదీ చంద్రబాబు నాయుడు అంటే అన్నారు.

ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజన్న లోకేశ్.. రాష్ట్ర దశ, దిశ మార్చే రూ.2 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు. ఉత్తరాంధ్ర కల అయిన విశాఖ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనేక రోడ్ల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మూడోసారి ప్రధాని అయ్యారు. 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని మీరంతా చూశారు. అదే 2019 నుంచి జరిగిన విధ్వంసాన్ని కూడా అందరూ చూశారు. మరోసారి మోదీకి ఏపీ ప్రజల తరఫున బేషరతుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News