Tuesday, June 24, 2025
Homeఆంధ్రప్రదేశ్NCW: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు.. జాతీయ మహిళా కమిషన్​ సీరియస్​

NCW: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు.. జాతీయ మహిళా కమిషన్​ సీరియస్​

అమరావతి మహిళలపై ప్రముఖ టీవీ ఛానల్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (National women commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.

“టీవీ చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అమరావతిని “వేశ్యల రాజధాని”గా పేర్కొనడం మహిళా రైతులకు దారుణమైన అవమానం. ప్రజా చర్చలో ఇటువంటి ఆమోదయోగ్యం కాని, రెచ్చగొట్టే ప్రకటనలను ఎన్‌సిడబ్ల్యు తీవ్రంగా ఖండిస్తుంది. త్వరితగతిన దర్యాప్తు చేయాలని, సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ చైర్‌పర్సన్ శ్రీమతి విజయ రహత్కర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.” అని కమిషన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.

కాగా ప్రముఖ ఛానెల్‌ డిబేల్ లో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలను ఉద్దేశించి వేశ్యల రాజధాని అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రుమారం రేగుతోంది. దీంతో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో అమరావతి మహిళలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News