AP Revenue Records: భూ సమస్యల పరిష్కారానికి ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు భూ సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ.. ఈ మేరకు రెవెన్యూ శాఖలో మార్పులు చేయాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
నేడు రెవెన్యూ శాఖపై పూర్తి సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రాజధాని అమరావతిలోని సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు, ల్యాండ్ మాపింగ్, రికార్డు భద్రత, పట్టాదారుల హక్కులు, సేవలు వేగవంతం చేయడం వంటి అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. శాఖలో ఎంతో కాలంగా ఉన్న సమస్యలపై కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం.
రెవెన్యూ శాఖ ఎదుర్కొంటున్న ఇప్పటికే ఉన్న సమస్యలుై ఇప్పటికే పరిష్కార మార్గాలను చర్చించారు సీఎం చంద్రబాబు. పట్టాదారుల పాస్‌బుక్‌లు, రేషన్ కార్డులు, భూ రికార్డుల ప్రక్షాళన వంటి వాటిపై వేగంగా పని చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు
1) గ్రామ, మండల స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ డ్రైవ్ నిర్వహించాలి.
2) డిజిటల్ రికార్డుల యాక్సెస్ పెంపుదలకు గ్రీన్ సిగ్నల్.
3) ఏదైనా సమస్యపై స్పందన వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
4) రెవెన్యూ అధికారుల పనితీరుపై మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రతిపాదన
5) రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ సేవలు అభివృద్ధి చేయడం
6) అతి త్వరలోనే రెవెన్యూ శాఖలో నూతన మార్గదర్శకాలు, మార్పులు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.