Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Mayor Elections: 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్‌

Mayor Elections: 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్‌

Nellore Eluru Mayor Elections:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు,ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పదవుల భర్తీ ప్రక్రియకు తేదీ ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఈ రెండు నగరాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులకు..

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కమిషన్ స్పష్టం చేసింది. పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులకు ఈ నెల 20వ తేదీలోపు అధికారిక సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలను నెల్లూరు, ఏలూరు జిల్లాల కలెక్టర్లు మరియు నగరపాలక సంస్థల కమిషనర్లకు ఇప్పటికే పంపినట్లు తెలిపింది.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/ap-govt-renames-revenue-junior-assistant-posts/

కౌన్సిల్ ప్రత్యేక సమావేశం..

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏవైనా అత్యవసర పరిస్థితుల వల్ల ఆ రోజు సమావేశం జరగకపోతే, తదుపరి రోజు అంటే 27వ తేదీన తప్పనిసరిగా సమావేశం నిర్వహించి ఎన్నికలు పూర్తిచేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశంపై ..

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన ఆధారాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిషన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం.

సామాజిక, ఆర్థిక పరిస్థితులపై..

ఈ కమిషన్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నియామకం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీల జనాభా వివరాలు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై లోతైన అధ్యయనం చేయడానికి కమిషన్‌కు 30 నుంచి 45 రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/low-pressure-forms-over-south-bay-of-bengal/

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన గణాంకాలను కమిషన్ పరిశీలనకు ఉపయోగించనుంది. స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది సేకరించిన ఈ డేటా ఆధారంగా రిజర్వేషన్ల అమలుపై కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News