Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nellore Lady Don : నెల్లూరు 'లేడీ డాన్' అరుణ.. గన్‌తో బెదిరింపులు.. మెడకు బిగుస్తున్న...

Nellore Lady Don : నెల్లూరు ‘లేడీ డాన్’ అరుణ.. గన్‌తో బెదిరింపులు.. మెడకు బిగుస్తున్న ఉచ్చు!

Nellore lady don Aruna case : ఒకప్పుడు సామాజిక కార్యకర్తగా పేరుపొందిన నిడిగుంట అరుణ ఇప్పుడు కబ్జాలు, దందాలు, తుపాకీతో బెదిరింపులకు పాల్పడుతూ ‘లేడీ డాన్’గా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మెడకు ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఇప్పటికే ఓ ఫ్లాట్ కబ్జా కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఆమెపై, తాజాగా మరో తీవ్రమైన కేసు నమోదు కావడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో తలదూర్చి, ఏకంగా తుపాకీతో బెదిరించిందన్న ఆరోపణలతో, ఆమె అరాచకాల చిట్టా మరింత పొడుగువుతోంది. అసలు ఎవరీ అరుణ..? ఆమె నేర సామ్రాజ్యం వెనుక ఉన్నదెవరు..?

తాజాగా గన్‌తో బెదిరింపుల కేసు: నెల్లూరుకు చెందిన శశికుమార్ అనే వ్యక్తి, తన అన్నతో ఉన్న ఆస్తి వివాదంలో నిడిగుంట అరుణ తలదూర్చి, తనను గన్‌తో బెదిరించిందని నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణపై కొత్తగా మరో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

పోలీసుల కస్టడీలో అనుచరులు.. బయటపడుతున్న నిజాలు: అరుణ నేర సామ్రాజ్యంపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

అనుచరుల విచారణ: ఆమె ప్రధాన అనుచరులైన పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అఫ్సర్, షేక్ మునీర్, మచ్చకర్ల గణేష్, ఎలిషాలను కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరుణతో కలిసి చేసిన నేరాలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్ల గురించి వారి నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు.

రౌడీషీటర్లతో సంబంధాలు: ఇప్పటికే అరెస్టుకు దారితీసిన కోవూరు బిల్డర్ బెదిరింపుల కేసులో, అరుణకు రౌడీషీటర్ శ్రీకాంత్ గ్యాంగ్‌తో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. వారిని అడ్డం పెట్టుకుని గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో అనేక దందాలు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది.

రేపటితో ముగియనున్న రిమాండ్: సాయి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను ఆక్రమించిన కేసులో ఈ నెల 19న అరెస్టయిన అరుణ, మరో ఆరుగురు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ రిమాండ్ రేపటితో ముగియనుండటంతో, కొత్తగా నమోదైన కేసులో ఆమెను మళ్లీ అదుపులోకి తీసుకుని, మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
అరుణ అరెస్టుతో, ఆమె బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తుండటంతో, ఆమె నేరాల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad