Wednesday, January 21, 2026
Homeఆంధ్రప్రదేశ్AP DGP: సీఎం చంద్రబాబును కలిసిన కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

AP DGP: సీఎం చంద్రబాబును కలిసిన కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు జనవరి 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో హరీష్‌ గుప్తాను ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 1992కు చెందిన గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు.

- Advertisement -

కాగా గత ఎన్నికల సమయంలో హరీష్‌ కుమార్‌ గుప్తాను ఇంఛార్జ్ డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ద్వారాకా తిరుమలరావును డీజీపీగా ఎంపిక చేసింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన గుప్తా ఏపీ క్యాడర్‌కు ఎంపిక అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News