Tirumala| కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు ముందుకొచ్చింది. నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు శ్రీవారి దర్శనం అనంతరం ప్రధాన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.
- Advertisement -
దీంతో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకలం కలగడంతో పాటు భక్తులకు తీవ్ర అసహనం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన టీటీడీ బోర్డు రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని తీర్మానం చేసింది. తాజాగా ఈ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇకపై తిరుమలలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.