Road Accident Bride Died: కోటి ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ అత్తారింటికి పయనమైన నవవధువుకి అదే చివరి రోజు అయింది. పసుపు బట్టలు, కాళ్ల పారాణి, పుస్తెమెట్టెలతో మెట్టినింట దీపం పెట్టడానికి సంతోషంగా బయలుదేరిన కొత్త కోడలు.. మార్గమధ్యలోనే రక్తపు మడుగులో తేలింది. విశాఖపట్నం జిల్లా అగనంపూడిలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందిన సంఘటన ఇరు కుటుంబాలతో పాటు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/fire-breaks-out-in-furniture-warehouse-in-asif-nagar/
బుధవారం రాత్రి వాడచీపురుపల్లిలో రామేశ్వరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి వేడుక అనంతరం కొత్త జంట కారులో అత్తవారింటికి బయలుదేరారు. శనివాడ జంక్షన్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో పెళ్లి దండలతోనే నవ వధువు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. వరుడికి స్వల్ప గాయాలయ్యాయి. మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.

Also Read: https://teluguprabha.net/national-news/work-from-home-2-days-a-week-in-delhi/
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో వైభవంగా కూతురికి పెళ్లి చేసి అత్తింటికి పంపగా.. అంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

