మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి కూటమి నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజానేత ఎన్ ఎం డి ఫరూక్ ను ప్రకటించడంతో నంద్యాల టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా నంద్యాల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ ఎం డి ఫరూక్ ను ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. నంద్యాల వ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో బాణసంచా కాల్చుతూ , స్వీట్లు పంచుతూ బైక్ ర్యాలీలు చేస్తూ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం, నారా చంద్రబాబు నాయుడు తన పై పెట్టిన నమ్మకాన్ని ఓమ్ముచేయ్యకుండా, నంద్యాలలో టీడీపీ జెండాను రెపరేపలాడిస్తామని అన్నారు. నంద్యాలలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం తెలుగుదేశం హయాంలోనే జరిగిందని ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందిస్తామని తెలియజేశారు. గత 42 ఏళ్లుగా పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. 20 ఏళ్ల తర్వాత నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా టీడీపీని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నంద్యాల ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని నంద్యాలలో 20 ఏళ్ల శిల్పా కుటుంబ అరాచక పాలనను తరిమికొట్టేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఐకమత్యంగా కలిసి ముందుకువెళ్లి టీడీపీ పార్టీని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నంద్యాల ప్రజలు ఎన్ ఎం డి ఫరూక్, తనయుడు ఫిరోజ్ ను ఆత్మీయంగా కలిసి వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.