నందికొట్కూర్ నియోజకవర్గం పగిడ్యాల మండల పరిధిలోని శనివారం రాత్రి నెహ్రూ నగర్ గ్రామంలో ఎస్సై జయ కుమార్ పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు, రూరల్ సీఐ విజయభాస్కర్, నందికొట్కూరు అర్బన్ సిఐ ప్రకాష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రామాల్లో పోలిస్ ఆధ్వర్యంలో చేపట్టే పల్లెనిద్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించాలని, సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతూ, శాంతిభద్రతల పరిరక్షణ చేయటమే ముఖ్య ఉద్దేశం అన్నారు.
గ్రామాల్లో అల్లర్లు, అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో కూడా ప్రజా సమస్యలను, గ్రామంలో ప్రజలు పడుతున్న సమస్యత్మకమైన ఇబ్బందులు ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు నాయకులు ఎలాంటి సంఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణములో తమ కార్యక్రమాలను పోలీస్ శాఖ అనుమతితో నిర్వహించుకోవాలన్నారు. పల్లె నిద్రలో గ్రామాల్లో ప్రజా భద్రత కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ సిబ్బంది, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.