Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Nori Dattatreya: క్యాన్స‌ర్ చికిత్స‌లో జ‌గ‌న‌న్న దార్శినిక‌త అద్భుతం

Nori Dattatreya: క్యాన్స‌ర్ చికిత్స‌లో జ‌గ‌న‌న్న దార్శినిక‌త అద్భుతం

క్యాన్సర్ చికిత్సపై జగన్ చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు-డాక్టర్ నోరీ దత్తాత్రేయ

క్యాన్స‌ర్ రోగానికి అత్యాధునిక వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకుంటున్న చ‌ర్య‌లు రాష్ట్రంలోని పేద రోగుల‌కు ఎంతో మేలు చేస్తున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఎంతో దార్శిక‌త‌తో జ‌గ‌న‌న్న క్యాన్స‌ర్ నియంత్ర‌ణకు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో గురువారం క్యాన్స‌ర్ నివార‌ణ- ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు, క్యాన్స‌ర్ చికిత్స‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డాక్ట‌ర్ నూరి ద‌త్తాత్రేయ‌ ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు, క‌మిష‌న‌ర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్‌, ఏపీవీవీపీ క‌మిష‌న‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం క్యాన్స‌ర్ చికిత్స‌కు ఏడాదికి రూ.600 కోట్ల‌కు పైగా నిధులు ఒక్క ఆరోగ్య‌శ్రీ కింద‌నే ఖ‌ర్చు చేస్తున్న‌ద‌ని తెలిపారు. మొత్తం 648 క్యాన్స‌ర్ ప్రొసిజ‌ర్లకు ఆరోగ్య‌శ్రీ కింద చికిత్స అంద‌జేస్తున్నామ‌న్నారు.

- Advertisement -

ఆరోగ్య శ్రీ ఆస్ప‌త్రుల‌న్నీ క్యాన్స‌ర్ గ్రిడ్ ప‌రిధిలోకి
మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64 క్యాన్స‌ర్ కేర్ ఆస్ప‌త్రులు ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలో ఉన్నాయ‌ని తెలిపారు. అన్ని ఆస్ప‌త్రుల్లో చికిత్స ఏకీకృతంగా ఉండాలే చూడాల‌ని పేర్కొన్నారు. ఆయా ఆస్ప‌త్రుల‌న్నింటినీ క్యాన్స‌ర్ గ్రిడ్ ప‌రిధిలోకి తీసుకొస్తేనే ఇది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. అందుకే విశాఖ‌ప‌ట్ట‌ణంలోని హోమీబాబా క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి కేంద్రంగా ఉన్న స్టేట్ క్యాన్స‌ర్ గ్రిడ్‌లో క‌చ్చితంగా ఆరోగ్య‌శ్రీ ఆస్ప‌త్రులు అనుసంధానం కావాల‌ని చెప్పారు. పాలియేటివ్ కేర్ ఎంతో కీల‌మ‌ని రోగి చివ‌రిద‌శ‌లో చికిత్స అందించే విష‌యంలో ఆస్ప‌త్రులు ఆస‌క్తి చూపించ‌డ‌క‌పోవడం స‌రికాద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఆరోగ్య‌శ్రీ ఆస్ప‌త్రిలో 5 శాతం బెడ్లు పాలియేటివ్ కేర్ కోసం కేటాయించేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు.

క్యాన్స‌ర్‌కు అత్యాధునిక చికిత్స‌
క్యాన్స‌ర్ ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌తి టీచింగ్ ఆస్ప‌త్రిలో క్యాన్స‌ర్‌కు చికిత్స ను స‌మ‌ర్థ‌వంతంగా అందించేందుకు రూ.120 కోట్లు ఖ‌ర్చుచేస్తోంద‌న్నారు. క‌ర్నూలు, క‌డ‌ప‌లో స్టేట్ క్యాన్స‌ర్ సెంట‌ర్ల ఏర్పాటుకు మొత్తం రూ.220 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. ఈ రెండు చోట్లా క్యాన్స‌ర్ కేర్ సెంట‌ర్లు అక్టోబ‌ర్ చివ‌రి క‌ల్లా అందుబాటులోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. గుంటూరులోని క్యాన్స‌ర్ కేర్ సెంట‌ర్‌ను కూడా తొలి విడ‌త‌లోనే పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పారు. రెండో విడ‌త లో అనంత‌పూర్‌, కాకినాడ‌ల్లో క్యాన్స‌ర్ ఆస్ప‌త్రుల‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ఏపీకి చెందిన ప్ర‌తి క్యాన్స‌ర్ రోగి మ‌న రాష్ట్రంలోనే పూర్తి ఉచితంగా, అత్యాధునిక వైద్యాన్ని పొందాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న‌న్న ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు.
ఏపీలో క్ర‌మప‌ద్ధ‌తిలో వ‌స‌తుల క‌ల్ప‌న- నోరి ద‌త్తాత్రేయుడు
ఏపీలో ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిన క్యాన్స‌ర్ ఆస్ప‌త్రుల‌ను అభివృద్ధి చేస్తున్నార‌ని ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు నోరి ద‌త్తాత్రేయుడు తెలిపారు. ముందుగా 30 ఏళ్లు నిండిన వారంద‌రికీ స్క్రీనింగ్ చేయ‌డం, స‌మ‌స్య‌ను గుర్తిస్తే.. ప‌రీక్ష‌ల‌కు పంప‌డం, ప‌రీక్ష‌ల్లో నిర్థార‌ణ అయితే చికిత్స అందించ‌డం… ఈ ల‌క్ష్యంతోనే ఏపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ద‌ని చెప్పారు. ఇప్ప‌టికే మంచి ఫ‌లితాల‌ను సాధిస్తోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాన్స‌ర్ కు చికిత్స అందించేందుకు తొలి స‌మావేశంలో ఏ మాట‌లైతే చెప్పారో వాటిని అమలు చేసుకుంటూ వెళ్లిపోతున్నార‌ని పేర్కొన్నారు. దేశంలోనే క్యాన్స‌ర్‌కు పూర్తి ఉచితంగా, అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News