Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

Tirumala: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం 6 గంటల సమయం పడుతుండగా.. రూ.300 టికెట్లు ఉన్న భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 69,333 మంది భక్తులు దర్శించుకోగా.. 22,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇక స్వామివారి సేవల విషయానికొస్తే.. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శుద్ధి రాత్రి పూట కైంకర్యం(ఏకాంతం) సేవ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అర్థరాత్రి 1 నుంచి 1.30 వరకు శుద్ధి ఏకాంత సేవ ప్రిపరేషన్ ఉంటుంది.1.30 గంటల నుంచి ఏకాంత సేవ ఉంటుంది.

ఇదిలా ఉంటే తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం దృష్ట్యా వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రొటోకాల్‌ ప్రముఖలు మినహా.. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని పేర్కొంది. ఈనెల 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News