Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Job Notification : ఏపీ పంచాయితీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు

Job Notification : ఏపీ పంచాయితీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు

ఏపీ పంచాయితీ రాజ్ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మండల కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.

- Advertisement -

డిసెంబర్ 20 అనగా రేపటిలోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం తెలిపిన వివరాల మేరకు.. జిల్లా వ్యాప్తంగా 22 మండల కో ఆర్డినేటర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీసీఏ/ ఎంసీఏ/ బీటెక్‌(సీఎస్‌ఈ/ ఈసీఈ/ ఈఈఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేలు జీతం చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad