Wednesday, November 12, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల తేదీలివే

ఏపీ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల తేదీలివే

ఏపీ పోలీస్ శాఖలో 6,511 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 411 ఎస్సై, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై పోస్టులకు డిసెంబర్ 14 నుండి జనవరి 18 వరకు, కానిస్టేబుల్ పోస్టులకు నవంబర్ 30 నుండి డిసెంబర్ 28 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది జనవరి 22న, ఎస్సై పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు slprb.ap.gov.in వెబ్ సైట్ చూడొచ్చు.

- Advertisement -

భర్తీ కానున్న పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ఇటీవలే రిజర్వేషన్లను పెంచుతున్నట్లు తెలిపారు. 315 సివిల్ ఎస్సైలు, 96 ఆర్ఎస్సై పోస్టులు భర్తీ కానున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2560 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad