Homeఆంధ్రప్రదేశ్AP Pensions: జూన్ నెల ఎన్టీఆర్ భరోసా నిధులు విడుదల

AP Pensions: జూన్ నెల ఎన్టీఆర్ భరోసా నిధులు విడుదల

AP Pensions: పింఛనుదారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జూన్‌ నెలకు సంబంధించి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను విడుదల చేసింది. మొత్తంగా రూ. 2,728 కోట్ల నిధులను కేటాయించనుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/sandstorms-and-heavy-rains-in-rajasthan/

జూన్‌ 1వ తేదీ ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదును పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, జూన్ 12వ తేదీ నుంచి మరో కొత్త వితంతు పింఛన్లను ప్రభుత్వం జారీ చేయనుంది. మొత్తంగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజారూ చేసింది. ఈ పింఛన్ల కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లు విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ. 65,886.57 కోట్లు ఖర్చు చేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News