Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్NTR Medical Services: నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్న ఎన్టీఆర్ వైద్య సేవలు

NTR Medical Services: నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్న ఎన్టీఆర్ వైద్య సేవలు

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు (NTR Medical Services) నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి. బకాయిలు రూ. 500 కోట్ల తక్షణం విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.దాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి.

- Advertisement -

ఎన్టీఆర్ వైద్య సేవలు మంగళవారం నుంచి ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆశా ( ASHA) కార్యవర్గం సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆషా టీం ప్రకటించింది

ముఖ్య గమనిక
డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి హాస్పిటల్ ఎంపానెల్, నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులు చేయిస్తామని, జరిమానాలు విధించకుండా, తనిఖీలు లేకుండా చూస్తామని కొంతమంది ఆగంతుకులు అధికారుల పేర్లు చెప్పుకొని హాస్పిటల్స్ వారిని సంప్రదిస్తున్నారు. దీనిపై డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారు పోలీసులకి ఫిర్యాదు చేశాం. హాస్పిటల్ యజమాన్యము ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే ఈ క్రింది హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వవలసినదిగా డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కోరారు.
హెల్ప్ లైన్ నెంబర్: 9281074745

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad