రాష్ట్ర ప్రజలకు నవరత్న పథకాల ద్వారా సీఎం జగనన్న నాయకత్వంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చి విధంగా స్థలాలు కేటాయించి, వాటికి హక్కులు కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ స్థానిక నేతలు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా పేదలందరికీ ఇల్లు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పేదవాడి సొంత ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. పారదర్శక పాలనకు ఇది నిదర్శనమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధార అన్నారు. పట్టణంలోని జై కిసాన్ పార్క్ నందు మున్సిపల్ కమిషనర్ టి సుధాకర్ రెడ్డి కార్యనిర్వహణలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన రెండో విడత జగనన్న పక్కా గృహ నిర్మాణాల రిజిస్ట్రేషన్ పత్రాలు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధార హాజరయ్యారు.
సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలో 1 నుండి 8 సచివాలయాల పరిధిలో జగనన్న పక్క గృహ నిర్మాణ 682 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను . అనంతరం చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు పురపాలక సంఘాన్ని మునుపెన్నడు లేని విధంగా ప్రతి వార్డులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా, నిరుపేదలైన ప్రజలకు కులం మతం రాజకీయం చూడకుండా పారదర్శకంగా మొదటి విడత 2015, రెండో విడత 682 మంది లబ్ధిదారుల పేదవాడి సొంతింటి కల నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తూ ఇంటిపై సర్వహక్కులను రిజిస్ట్రేషన్ ద్వారా పత్రాలు అందజేయడం మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రిగా సాధ్యం కాలేదన్నారు. అది సీఎం జగనన్నకే సాధ్యమైందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ దార కొనియాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రజల సంక్షేమం కోసం పరితపించే జగనన్న నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని, తమ ఎమ్మెల్యే అభ్యర్థిత్వని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సోమేశ్వరిదేవి, కౌన్సిలర్స్ కాటేపోగు చిన్న రాజు, అబ్దుల్ హమీద్, అబ్దుల్ రావుఫ్, షేక్ నాయబ్, చాంద్బాషా, చెరుకు సురేష్, అల్లూరి కృష్ణ, వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఉస్మాన్ బేగ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజ్, వైసీపీ నాయకులు సనా అబ్దుల్లా, శాలిబషా, ఎస్సీ సెల్ నాయకులు రామకృష్ణ, సచివాలయ విఆర్వోలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.