Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

Tirumala: తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

Tirumala| తిరుమల పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు(Padmavati Brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం అమ్మవారిని సర్వభూపాల వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవ సేవ, రాత్రికి గరుడ వాహన సేవ(Garuda Vahana Seva) నిర్వహించనున్నారు. భక్తులు భారీగా వచ్చే నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉంటే నేడు తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ఇప్పటికే 3000 దర్శనం టోకెన్లను స్థానిక భక్తులకు అందజేశారు. ప్రతి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకసారి దర్శనం చేసుకున్న భక్తులకు మళ్లీ 90 రోజుల తర్వాతే దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని టీటీడీ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News