Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Palabhishekam to Jagan pic: జగన్ ఫోటోకు పాలాభిషేకం

Palabhishekam to Jagan pic: జగన్ ఫోటోకు పాలాభిషేకం

డ్వాక్రా రుణమాఫీ చేసిన ఏకైక సీఎం జగన్

దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సంక్షేమ పథకాలను మహిళల పేరిటే అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ పేర్కొన్నారు.

- Advertisement -

పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉప్పులూరు మంతెన తెన్నేరు మారేడుమాక వేల్పూరు గ్రామాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు నాలుగో విడత ఏర్పాటు చేసిన వైయస్సార్ ఆసరా మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఐదు గ్రామాల లబ్ధిదారులకు 310 పొదుపు సంఘాలకు చెందిన 3104 మంది సభ్యులకు 2.98 కోట్ల రూపాయల ఆసరా మెగా నమూనా చెక్కును, కంకిపాడు మండలం మొత్తం 1209 పొదుపు సంఘాలకు చెందిన 12095 మంది సభ్యులకు సంబంధించి 11.29 కోట్ల రూపాయల నమూనా చెక్కును పంపిణీ చేశారు.

తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా అక్కచెల్లెళ్లకు బటన్ నొక్కి డ్వాక్రా రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. అలాగే అమ్మబడి పథకం కింద పిల్లల చదువు కోసం వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు.

45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లేమ్మలకు సంవత్సరానికి 18750 రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలలో 75 వేల రూపాయలు జమ చేసిన ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. ప్రతినెల ఒకటో తేదీన సూర్యోదయం కాగానే వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి అవ్వతాతలు, దివ్యాంగులు వితంతువులకు పింఛను అందిస్తున్న రాష్ట్రం మనదే అన్నారు. పిల్లలు ఇంజనీరు, బీఈడీ వంటి కోర్సుల్లో నయా పైసా ఖర్చు లేకుండా చదివిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులు అగ్రవర్ణాల పేద పిల్లలు ఆంగ్ల భాషలో చదువుకోవాలని ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. ప్రైవేటు, కాన్వెంటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులలో విద్యా కానుక, మధ్యాహ్నం గోరుముద్ద, ప్రతిరోజు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి, తదితర అన్ని పథకాలతో పిల్లలను చదివించాల్సిన బాధ్యత తల్లులపై ఉందన్నారు. బంగారం గాని, ధనం గాని శాశ్వతం కాదని చదివే శాశ్వతం అని గుర్తించాలన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా పేద పిల్లలను 1.25 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అమెరికాకు పంపించి చదివిస్తున్నారన్నారు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపాలని ప్రతిరోజు సాయంత్రం ఒక గంట వారిని పక్కన కూర్చోబెట్టుకొని బాగా చదువుకొని పైకి రావాలని ప్రోత్సహించాలన్నారు. ప్రతి 60-70 ఇళ్లకు వాలంటీర్లను సైన్యంగా ఏర్పాటు చేసి కరోనా సమయంలో మీ ఇంటి వద్దకే వచ్చి మీ బాధలను ఇబ్బందులను గమనించి సహాయపడ్డారన్నారు. ప్రతి గ్రామంలో పది మందితో కూడిన సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి సేవలందించడం జరుగుతుందన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేస్తున్నామన్నారు.

రేషన్ను ఇంటి వద్దకే అందజేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఆసుపత్రుల ద్వారా 14 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు 105 రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి వైద్యం కోసం ఎలాంటి ఖర్చు లేకుండా అందరిని ఆదుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద గతంలో 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుంటే నేడు 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే సదుపాయం కల్పించామన్నారు. మహిళలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేసి లక్షాధికారులను చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనూష డి ఆర్ డి ఏ ఏరియా కోఆర్డినేటర్ ఈ రంగారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, డిఆర్డిఏ ఐకెపి సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News