కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జైల్లో వంశీతో వైసీపీ అధినేత జగన్(Jagan) ములాఖత్ అయ్యారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ (Palla Srinivasa Rao) బహిరంగ లేఖ రాశారు.
- Advertisement -
“ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినందుకు మద్దతు ఇస్తున్నారా… జగన్ మోహన్ రెడ్డి గారు..?. జైలులో ఉన్న దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి వంశీని పరామర్శించేందుకు వచ్చారా జగన్…? దోపిడిదారుడు వంశీని ఎందుకు ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలి…?” ఈ మేరకు జగన్‌కు 10 ప్రశ్నలు సంధించారు.

