నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు భూమా కిషోర్ రెడ్డి అభిమానులు, గ్రామప్రజలు. అనంతరం ప్రజలు గ్రామంలో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోగా, వారు తెలియ చేసిన సమస్యలు అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని, అర్హులైన వారికి పక్కా ఇండ్లు శాంక్షన్ చేయడం లేదని గ్రామస్తులు తెలియజేయగా.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం గ్రామంలో సిసి రోడ్లు ఉన్న డ్రైనేజ్ కాలువలు లేకపోవడం వల్ల వర్ష కాలం మురికి నీరు ఇళ్లలోకి వస్తున్నాయని భూమా కిషోర్ రెడ్డి దృష్టికి తీసుకు రాగా తాను అధికారంలోకి రాగానే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మధుసూదన్ రెడ్డి, శివ భాస్కర్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, చిన్న బయన్న, బలి రెడ్డి, శివ రామి రెడ్డి, రామ లక్ష్మి రెడ్డి, మనోహర్ రెడ్డి, నందిశ్వర రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, మండల నాయకులు శంకర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, విక్రమ్ రెడ్డి, బ్రహ్మ నంద రెడ్డి, లక్ష్మి నారాయణ , చాగలమర్రి గౌస్ , లక్ష్మయ్య తదితర నాయకులు భూమా కార్యకర్తలు పాల్గొన్నారు.
Palle Nidrya by Bhuma: ‘పల్లె నిద్ర’లో భూమా
చిన్నవంగలి గ్రామంలో కిషోర్ రెడ్డి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES