Homeఆంధ్రప్రదేశ్Papikondalu: నేటి నుంచి పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Papikondalu: నేటి నుంచి పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Papikondalu: గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రంపచోడవరం ఆర్డీవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

ఇటీవల తప్పిన పెను ప్రమాదం: ఇటీవల దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి దాదాపు 89 మంది పర్యాటకులతో ఒక బోటు పాపికొండల విహారయాత్రకు బయలుదేరింది. అయితే దేవీపట్నం ప్రాంతానికి చేరుకునే సరికి ఆ బోటులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్‌ అప్రమత్తమై బోటును సురక్షితంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. దీంతో బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Also read-Tuni child case: తుని చిన్నారి అదృశ్యం.. మిస్టరీగానే మిగిలిపోనుందా!

ఫిట్‌నెస్ నివేదిక వచ్చాకే అనుమతులు: బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్.. బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలపై తక్షణమే పూర్తిస్థాయి పరిశీలన జరపాలని ఆదేశించారు. దీంతో రంపచోడవరం ఆర్డీవో స్వాతి.. పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేత్తున్నట్లు తెలిపారు. “కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం అన్ని పర్యాటక బోట్ల భద్రతా ప్రమాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వీటిపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే తిరిగి బోట్ల రాకపోకలకు అనుమతులు మంజూరు చేస్తాం. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని ఆర్డీవో స్వాతి స్పష్టం చేశారు. అధికారుల తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్యాటకులు పాపికొండల ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News